కొన్ని పరిహార క్రియలు పాటించడం ద్వారా మన కున్న సమస్యలను పోగొట్టుకోవచ్చు. అటువంటి వి కొన్ని మీకోసం.
శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే, వారి చేస్తున్న ఆటంకాలను అధిగమించాలంటే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి.
తరచూ అనారోగ్యాలు కలుగుతుంటే రావి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.
పితృదేవతలు శాంతించేందుకు మేడి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.
ప్రతిరోజు రావిచెట్టు దగ్గర ఉండే జంటనాగుల దగ్గర బియ్యపు పిండితో ముగ్గు పెట్టి, మట్టిప్రమిదలో నువ్వుల నూనె గానీ, ఆవునెయ్యి గానీ పోసి, దీపారాధన చేసి, 27 ప్రదక్షిణలు చేయాలి. ఇలా కొంత కాలం చేస్తూ ఉంటే స్త్రీ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
విపరీతమైన కోపం తగ్గడానికి ఆదివారం రోజున నవగ్రహాల్లో ఉండే సూర్యుని దగ్గర దీపం పెట్టాలి. దీపం తూర్పు వైపు చూసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనంతరం సూర్యుని విగ్రహం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. దీని వల్ల విపరీతమైన కోపం తగ్గుతుంది.
భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి జంట నాగుల దగ్గర నిమ్మడొప్పల్లో నువ్వుల నూనె పోసి, తూర్పు ముఖంగా వెలిగే విధంగా 25 ఆదివారాలు దీపారాధన చేయాలి. దీని వల్ల భార్య భర్తల మధ్య గొడవలు సమసిపోయి, తిరిగి ఏ విధమైన గొడవలు రాకుండా ఉంటాయి.
No comments:
Post a Comment