Zee Telugu Omkaram Devi Sree Guruji Tips
వివాహము ఆలస్యం అవుతోందా.............!!
వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం,
చంద్రుడితో దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం మరియు సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం,
గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ
మంత్రానుష్ఠానం చేయించడం.
గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ
మంత్రానుష్ఠానం చేయించడం.
శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం
పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.
శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ, ఇంకా లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శుభకరం.

అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు.
గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం ఉన్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభం.
దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు
సంతృప్తి పొందితే సత్వరం శుభ ఫలితాలు ఉంటాయి. పై శాంతి చేయించడం ద్వారా జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలం మారవు. ప్రయత్నాలలో అవరోధాలు,
చికాకులు తొలగుతాయి.

వెండి దీపాలతో ఆరాధన, ఫలితాలు.....!!
వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ, పొద్దు తిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు, శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.
వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే.......!!
శుక్ల పక్షంలో ( అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో) వచ్చే గురు వారం రోజు ప్రారంభించి, అరటి చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసి, గురువారం రోజు ఏదైనా గురు స్వరూపాన్ని దర్శించుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుంది.
స్థిరత్వం లేని వారికి జీవిత స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి.........!!
శివాలయం, అమ్మవారి ఆలయం కలిసి ఉండే దేవాలయం అంటే ఆలయంలో కచ్చితంగా మరొకరి ఆలయం ఉండాలి. అలాంటి ఆలయంలో 11 సోమవారాలు నంది దగ్గర తూర్పు ముఖంగా దీపం వెలిగించాలి. దీని ద్వారా స్థిరత్వం లేని వారికి వెంటనే స్థిరత్వం లభిస్తుంది.
మనస్సుకు ప్రశాంతత కొరకు.......!!
శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .
శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి
పెరుగు అన్నం ,
లేదా పెసరపప్పు ,
లేదా వడపప్పు ,
లేదా పానకం ,
లేక మజ్జిగ
లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి .
కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు , జాకెట్టు ముక్క , చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం .
తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లు గా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి .. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా , త్వరగా నెరవేరతాయి .

లగ్నములు కారకత్వములు
.......................................................
మేషం :- ఈ లగ్న జాతకులకు శని, బుధ, శుక్రులు పాపులు, రవి, గురులు శుభులు. శని, గురు సంబంధం కలిసిన గురుడు శుభుదు కాదు. శని మారక గ్రహం.
వృషభం: ఈ లగ్న జాతకులకుగురు, శుక్ర, చంద్రులు పాపులు. రవి, శనులు శుభులు. శని రాజయోగకారకుడు. గురుదు మారక గ్రహం .
మిథునము: ఈ లగ్న జాతకులకు కుజ, గురువులు పాపులు. శు క్రు డు శుభుడు. శని, గురులు చేరినచో ఫలితము బాగా వుండదు.
కర్కాటకము: . ఈ లగ్న జాతకులకు శుక్ర, శని, బుధ, కు, గురు లు పాపులు. కుజుడు రాజయోగకారకుడు, గురు, కుజులు రాజయోగకారకులు. శుక్రుడు మారక గ్రహం.
సింహం: ఈ లగ్న జాతకులకు శని, బుధ , శుక్రులు పాపులు.కుజుడు రాజయోగకారకుడు. గురు, శుక్రులు చేరినచో ఫలితము బాగా వుండదు. కుజ, గురులు కలిసిన శుభులు. ఈ జాతకునకు బుధు డు మారక గ్రహం.
కన్య:ఈ లగ్న జాతకులకు గురు, రవి, కుజులు పాపులు, శని, బుధులు శుభులు. శని రాజయోగకారకులు. చంద్ర, బుధులు కూడా శుభ యోగాన్నిస్తారు. గురుడు మారక గ్రహం.
తుల: ఈ లగ్న జాతకులకు గురు, రవి, కుజులు పాపులు. శని, బుధులు శుభులు. శని రాజయోగ కారకులు. చంద్ర బుధులు కూడా శుభ యోగాన్నిస్తారు. గురుడు మారకగ్రహం.
వృశ్చికము: ఈ లగ్న జాతకులకు బుధ, శుక్ర, శనిలు పాపులు. గురుడు శుభుడు. రవి, చంద్రులు శుభ యోగాన్నిస్తారు. బుధుడు ఈ జాతకానికి మారక గ్రహం.
ధనస్సు: ఈ లగ్న జాతకులకు రవి, కుజులు శుభులు, శుక్రుడు పాపి, రవి, బుధులు రాజయోగ కారకులు, శుక్రుడు మారకం చేయును.
మకరం: ఈ లగ్న జాతకులకు కుజ-గురు-చం ద్రులు పాపులు. శుక్ర, బుధులు శుభులు. శు క్రుడు రాజయోగ కారకుడు. శుక్రుడు, శని, బుధులతో కూడిన విశేష మైన ఫలాన్ని ఇస్తాడు. కుజుడు మారక గ్రహం.
కుంభం: ఈ లగ్న జాతకులకు కుజ- గురు- చంద్రులు పాపులు. శుక్రుడు శుభాగ్రహం. కుజుడు రాజయోగకారకుడుమరియు మారకుడు.
మీనం: ఈ లగ్న జాతకులకు రవి, శుక్రులు పాపులు. కుజ-చంద్రులు శుభులు. కుజ, గురులు రాజయోగగ్రహాలు. శని మారకగ్రహం.
Subscribe to:
Posts (Atom)