లగ్నములు కారకత్వములు


.......................................................
మేషం :- ఈ లగ్న జాతకులకు శని, బుధ, శుక్రులు పాపులు, రవి, గురులు శుభులు. శని, గురు సంబంధం కలిసిన గురుడు శుభుదు కాదు. శని మారక గ్రహం.
వృషభం: ఈ లగ్న జాతకులకుగురు, శుక్ర, చంద్రులు పాపులు. రవి, శనులు శుభులు. శని రాజయోగకారకుడు. గురుదు మారక గ్రహం .
మిథునము: ఈ లగ్న జాతకులకు కుజ, గురువులు పాపులు. శు క్రు డు శుభుడు. శని, గురులు చేరినచో ఫలితము బాగా వుండదు.
కర్కాటకము: . ఈ లగ్న జాతకులకు శుక్ర, శని, బుధ, కు, గురు లు పాపులు. కుజుడు రాజయోగకారకుడు, గురు, కుజులు రాజయోగకారకులు. శుక్రుడు మారక గ్రహం.
సింహం: ఈ లగ్న జాతకులకు శని, బుధ , శుక్రులు పాపులు.కుజుడు రాజయోగకారకుడు. గురు, శుక్రులు చేరినచో ఫలితము బాగా వుండదు. కుజ, గురులు కలిసిన శుభులు. ఈ జాతకునకు బుధు డు మారక గ్రహం.
కన్య:ఈ లగ్న జాతకులకు గురు, రవి, కుజులు పాపులు, శని, బుధులు శుభులు. శని రాజయోగకారకులు. చంద్ర, బుధులు కూడా శుభ యోగాన్నిస్తారు. గురుడు మారక గ్రహం.
తుల: ఈ లగ్న జాతకులకు గురు, రవి, కుజులు పాపులు. శని, బుధులు శుభులు. శని రాజయోగ కారకులు. చంద్ర బుధులు కూడా శుభ యోగాన్నిస్తారు. గురుడు మారకగ్రహం.
వృశ్చికము: ఈ లగ్న జాతకులకు బుధ, శుక్ర, శనిలు పాపులు. గురుడు శుభుడు. రవి, చంద్రులు శుభ యోగాన్నిస్తారు. బుధుడు ఈ జాతకానికి మారక గ్రహం.
ధనస్సు: ఈ లగ్న జాతకులకు రవి, కుజులు శుభులు, శుక్రుడు పాపి, రవి, బుధులు రాజయోగ కారకులు, శుక్రుడు మారకం చేయును.
మకరం: ఈ లగ్న జాతకులకు కుజ-గురు-చం ద్రులు పాపులు. శుక్ర, బుధులు శుభులు. శు క్రుడు రాజయోగ కారకుడు. శుక్రుడు, శని, బుధులతో కూడిన విశేష మైన ఫలాన్ని ఇస్తాడు. కుజుడు మారక గ్రహం.
కుంభం: ఈ లగ్న జాతకులకు కుజ- గురు- చంద్రులు పాపులు. శుక్రుడు శుభాగ్రహం. కుజుడు రాజయోగకారకుడుమరియు మారకుడు.
మీనం: ఈ లగ్న జాతకులకు రవి, శుక్రులు పాపులు. కుజ-చంద్రులు శుభులు. కుజ, గురులు రాజయోగగ్రహాలు. శని మారకగ్రహం.

No comments:

Post a Comment