కలలో పెండ్లి వాయిద్యాలు కనబడితే ధనలాభము, వాహన లాభము కలుగును. అలాగే కలలో స్వర్గము కనిపించినచో ధనలాభము, సౌఖ్యము కలుగును. అదే కలలో యమలోకము కనపడినచో కష్టములు కలుగును.
కలలో చనిపోయిన వ్యక్తి కనపడినట్లైతే సుఖసంతోషములు, జయము, ధనలాభము కలుగును. కలలో తనకు పిచ్చి ఎత్తినట్లు కలవచ్చినచో ధననష్టము కలుగును. కలలో పిశాచములు కనబడితే దారిద్ర్యము, కార్యభంగము కలుగును.
చేపలు, కప్పలు, మొసలి మొదలగు జలచరములు కలలో కనబడటం మంచిది. తాబేలు కలలో కనిపించినట్లైతే దూరదేశమునకు పోయి అక్కడ అధికముగా ధనము సంపాదిస్తారు. ఎలుకలు కలలో కనిపిస్తే మంచిది కాదు. ధననష్టము, అపజయము కలుగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
No comments:
Post a Comment