రాత్రి అంట్లు శుభ్రం చేయకుండా అలాగే వుంచేస్తున్నారా.........

రాత్రిపూట అంట్లను శుభ్రం చేయకుండా అలాగే వుంచేస్తున్నారా, అయితే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసముండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనాలు, అల్పాహారంగానీ చేసిన తర్వాత ఆ అంట్లను అలాగే వుంచేస్తుంటారు. ఉదయాన్నే శుభ్రం చేయవచ్చునని అనుకుంటారు. అయితే ఈ అలవాటు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదని.. రాత్రి వేళకి సంబంధించిన అంట్లను వెంటనే శుభ్రపరుచుకోవడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగించే సమయంలో లక్ష్మీదేవి వస్తుందని అంటారు. అందువలన ఈ సమయంలో వీధి తలుపులు వేయకూడదని చెబుతుంటారు. తలుపులు మూసి వుంచడం వలన, అక్కడి వరకూ వచ్చిన లక్ష్మీదేవి వెంటనే వెనుదిరుగుతుందట. లక్ష్మీదేవి అలా నడచివస్తూ తన భక్తులకి సంబంధించి ఎవరి ఇల్లు పవిత్రంగా అనిపిస్తూ వుంటుందో వాళ్ల ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఈ కారణంగానే వీధి గుమ్మం దగ్గర పాదరక్షలు ఉండకూడదని అంటారు. అలాగే రాత్రి పూట ఇల్లు ఊడ్చిన చెత్త బయట పడేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడదామని అనుకుంటూ వుండగా, ఆ సమయంలో ఇల్లు ఊడ్చిన చెత్తతో ఎదురుపడకూడదనేదే ఇందులోని ఉద్దేశమని వారు చెబుతున్నారు.
Astro Numeric Venu's photo.

No comments:

Post a Comment