వివాహము ఆలస్యం అవుతోందా.............!!


వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం, 
చంద్రుడితో దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం మరియు సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం,
గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ 
మంత్రానుష్ఠానం చేయించడం.
శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం
పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.
శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ, ఇంకా లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శుభకరం.
అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు.
గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం ఉన్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభం.
దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు
సంతృప్తి పొందితే సత్వరం శుభ ఫలితాలు ఉంటాయి. పై శాంతి చేయించడం ద్వారా జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలం మారవు. ప్రయత్నాలలో అవరోధాలు,
చికాకులు తొలగుతాయి.

వెండి దీపాలతో ఆరాధన, ఫలితాలు.....!!


వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ, పొద్దు తిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు, శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.

వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే.......!!


శుక్ల పక్షంలో ( అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో) వచ్చే గురు వారం రోజు ప్రారంభించి, అరటి చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసి, గురువారం రోజు ఏదైనా గురు స్వరూపాన్ని దర్శించుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుంది.

స్థిరత్వం లేని వారికి జీవిత స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి.........!!


శివాలయం, అమ్మవారి ఆలయం కలిసి ఉండే దేవాలయం అంటే ఆలయంలో కచ్చితంగా మరొకరి ఆలయం ఉండాలి. అలాంటి ఆలయంలో 11 సోమవారాలు నంది దగ్గర తూర్పు ముఖంగా దీపం వెలిగించాలి. దీని ద్వారా స్థిరత్వం లేని వారికి వెంటనే స్థిరత్వం లభిస్తుంది.

మనస్సుకు ప్రశాంతత కొరకు.......!!


శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .
శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి
పెరుగు అన్నం ,
లేదా పెసరపప్పు ,
లేదా వడపప్పు ,
లేదా పానకం ,
లేక మజ్జిగ
లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి .
కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు , జాకెట్టు ముక్క , చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం .
తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లు గా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి .. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా , త్వరగా నెరవేరతాయి .

స్థిరమైన ఐశ్వర్యం కోసం.....!!


ఆకుపచ్చ చీర కట్టుకున్న శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉండే చిత్రపటాన్ని తూర్పు వైపు ఉంచి, రోజూ మహాలక్ష్మి అష్టకం చదవాలి. ప్రతి శుక్రవారం తులసిమాల వెయ్యాలి. దీనివల్ల లక్ష్మి చాంచల్యం తగ్గి స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది.

లగ్నములు కారకత్వములు


.......................................................
మేషం :- ఈ లగ్న జాతకులకు శని, బుధ, శుక్రులు పాపులు, రవి, గురులు శుభులు. శని, గురు సంబంధం కలిసిన గురుడు శుభుదు కాదు. శని మారక గ్రహం.
వృషభం: ఈ లగ్న జాతకులకుగురు, శుక్ర, చంద్రులు పాపులు. రవి, శనులు శుభులు. శని రాజయోగకారకుడు. గురుదు మారక గ్రహం .
మిథునము: ఈ లగ్న జాతకులకు కుజ, గురువులు పాపులు. శు క్రు డు శుభుడు. శని, గురులు చేరినచో ఫలితము బాగా వుండదు.
కర్కాటకము: . ఈ లగ్న జాతకులకు శుక్ర, శని, బుధ, కు, గురు లు పాపులు. కుజుడు రాజయోగకారకుడు, గురు, కుజులు రాజయోగకారకులు. శుక్రుడు మారక గ్రహం.
సింహం: ఈ లగ్న జాతకులకు శని, బుధ , శుక్రులు పాపులు.కుజుడు రాజయోగకారకుడు. గురు, శుక్రులు చేరినచో ఫలితము బాగా వుండదు. కుజ, గురులు కలిసిన శుభులు. ఈ జాతకునకు బుధు డు మారక గ్రహం.
కన్య:ఈ లగ్న జాతకులకు గురు, రవి, కుజులు పాపులు, శని, బుధులు శుభులు. శని రాజయోగకారకులు. చంద్ర, బుధులు కూడా శుభ యోగాన్నిస్తారు. గురుడు మారక గ్రహం.
తుల: ఈ లగ్న జాతకులకు గురు, రవి, కుజులు పాపులు. శని, బుధులు శుభులు. శని రాజయోగ కారకులు. చంద్ర బుధులు కూడా శుభ యోగాన్నిస్తారు. గురుడు మారకగ్రహం.
వృశ్చికము: ఈ లగ్న జాతకులకు బుధ, శుక్ర, శనిలు పాపులు. గురుడు శుభుడు. రవి, చంద్రులు శుభ యోగాన్నిస్తారు. బుధుడు ఈ జాతకానికి మారక గ్రహం.
ధనస్సు: ఈ లగ్న జాతకులకు రవి, కుజులు శుభులు, శుక్రుడు పాపి, రవి, బుధులు రాజయోగ కారకులు, శుక్రుడు మారకం చేయును.
మకరం: ఈ లగ్న జాతకులకు కుజ-గురు-చం ద్రులు పాపులు. శుక్ర, బుధులు శుభులు. శు క్రుడు రాజయోగ కారకుడు. శుక్రుడు, శని, బుధులతో కూడిన విశేష మైన ఫలాన్ని ఇస్తాడు. కుజుడు మారక గ్రహం.
కుంభం: ఈ లగ్న జాతకులకు కుజ- గురు- చంద్రులు పాపులు. శుక్రుడు శుభాగ్రహం. కుజుడు రాజయోగకారకుడుమరియు మారకుడు.
మీనం: ఈ లగ్న జాతకులకు రవి, శుక్రులు పాపులు. కుజ-చంద్రులు శుభులు. కుజ, గురులు రాజయోగగ్రహాలు. శని మారకగ్రహం.

దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు..........

దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు ఉంటారు. ఎవరైనా మనకి నమస్కరిస్తే దానిని ఊరికే పుచ్చుకోకూడదు. వారిని ఆశీర్వదించి వారిని మనం ఏ రకంగా అనుగ్రహించగలమో ఆ విధంగా కాపాడాలి. 
ఇప్పుడు యమధర్మరాజు గారికి నమస్కరిస్తే? ఆయన శక్తి అనుసారంగా ఆయన ఎలా అనుగ్రహించగలరో అలా అనుగ్రహిస్తారు. తప్ప నమస్కారాన్ని ఊరికే పుచ్చుకోరు ఎవరు. తప్పనిసరిగా ఆశీర్వదించి తీరాలి ఎంత మేరకు వీలైతే అంత వరకు. ఒహో వీడికి పాపం ఈ శరీరం బాధాకరంగా ఉన్నట్టుంది అందుకని నన్ను శరణు వేడుతున్నాడు అని శరీరంతో ఉన్న బంధనాన్ని తీసి వేస్తారు. లేదా, రోగాలు ప్రబలడానికి కారణం యమధర్మ రాజు గారి ఆగ్రహం అంటారు. ఒహో నాకు నమస్కరించావు కదా, సరేరా అబ్బాయి, నువ్వు చేస్కున్న పాపాలన్ని ఈ రోగం రూపంలో అనుభవించేయి, అప్పుడు ఇక నీకు వాటితో ఒక గొడవ వదిలిపోతుంది అని ఒక రోగాన్ని ప్రసాదిస్తారు చేస్కున్న పాపాలు అన్ని పోయేలాగ. ఆయన చేతుల్లో పనులేంటో అవి కటాక్షించగలరు. కానీ ఈ రెండూ కూడా సహజంగా ఎవరూ కోరుకునే కోరికలు కాదు కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.
ఒక్క సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని దిక్కులకి పెట్టే నమస్కారం తప్ప, ఇక వేరే ఎప్పుడూ దక్షిణ దిక్కుకి నమస్కారం పెట్టకూడదు. ఒకవేళ ఎవరైన పెద్దవారు దక్షిణ దిక్కున నిలబడినప్పుడు వారికి నమస్కరించాలి అనుకుంటే అయ్యా కాస్త ఇటుగా తిరగండి మీకు నమస్కరించుకుంటాను అని చెప్పి దిక్కు మరల్చి అప్పుడు నమస్కరించాలి. అది గురువుకైనా సరే తల్లిదండ్రులకైనా సరే.

ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు.....!!

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.
- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.
- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).
- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.
- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.
- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.
- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.
- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.

శివలింగాన్ని పూజించండి....!!

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.
2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.
3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.
4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.
5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.
6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.
7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.

శివాభిషేక ఫలములు....!!


• 1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
• 2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
• 3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
• 4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
• 5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
• 6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
• 7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
• 8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
• 9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
• 10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
• 11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
• 12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
• 13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
• 14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
• 15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
• 16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
• 17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
• 18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
• 19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
• 20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
• 21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
• 22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
• 23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
• 24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు

చదువుకు తగిన ఉద్యోగం లభించేందుకు........!!

చదువుకు తగిన ఉద్యోగం లభించేందుకు, సోమవారం పటిక ( పటికబెల్లం కాదు) పెనం మీద వేసి వేడి చేసి, పొంగించాలి. దాన్ని పై నుంచి కిందకు 7 సార్లు దిగదీసుకుని, పారే నీటిలో వేయాలి.

కారణాలు తెలియకుండా ఉన్నట్టుండి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటే.....

కారణాలు తెలియకుండా ఉన్నట్టుండి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటే, నువ్వుల నూనె లేదా ఆవనూనెను మూడుసార్లు పెద్ద వారితో దిగదుడిపించుకుని, నల్లని మట్టిలో పారవేయాలి.

అన్నీ ఉన్నా ప్రశాంతత లభించకుంటే ఏం చేయాలి......

అన్నీ ఉన్నప్పటికీ ప్రశాంతత లభించడం లేదు అనుకునే వారు ఇష్టదేవత ఆలయంలో 41 రోజుల పాటు తూర్పు దిక్కుగా ఉండే విధంగా దీపం పెట్టాలి.

ఆకస్మికంగా ఆదాయం తగ్గుతుంటే ఏం చేయాలి........!!

ఆకస్మికంగా ఆదాయం తగ్గుతుంటే ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయంలో ఇత్తడి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, 5 వత్తులు వేసి, 5 ముఖాలుగా వెలిగే విధంగా 44 రోజులు దీపం పెట్టాలి.

అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు .........!!

అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు శివాలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం దిక్కుగా నువ్వుల నూనెతో 44 రోజుల పాటు దీపారాధన చేయాలి.

పిశాచ బాధలు లెకుండ ఉండుటకు ......

ఆదివారం అమావాస్య నాడు తెల్ల వెంపలిచెట్టు వేరును సేకరించి తావీజులొ బందించి మెడ లేదా నడుముకు ధరిస్తే పిశాచ బాధలు ఉండవు.

వ్రుత్తి, ఉద్యొగం, వ్యాపారలలొ అభివృద్ది ,ఆర్ధిక లాబాలు పొందుటకు ..

ఆర్దిక ఇబ్బందులతో బాధపడేవారు ఎవరైనా సరే ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ సంధ్యా సమయంలో కలువ లేదా సంపెంగపూలతో దేవుని పూజిస్తుంటే ఆర్దికంగా మంచి అభివృద్ది వ్రుత్తి ఉద్యోగాలలో అభివృద్ది ,ఆర్ధిక లాబాలు పొందగలరు .

ఎవరైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ...........!!

ఎవరైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి కోసం గరిక కణువులను కుప్పగా పోసి శివపూజ అనంతరం ప్రవాహానదిలో నిమర్జన చేయుట వలన ప్రాణాపాయ పరిస్థితి నుండి బయట పడగలరు .

సర్వజనులతో మెహింపబడుటకు వశీకరణ తిలకం..........!!

వశీకరణ తిలకం కొరకు అమావాస్య రోజున నల్ల ఉమ్మెత్తు , గురిగింజ వేర్లను సేకరించి స్వచ్ఛమైన చందనం చెక్కతో కలిపి , మెత్తని పొడిగా తయారు చేసే అరటిచెట్టు నుండి వచ్చే నీళ్ళతో కలిపి ఈ మిశ్రమాన్ని తిలకముగా ధరించిన సర్వజనముతో మెహింప బడుదురు . భార్యాభర్తలు ధరిస్తే ప్రేమాభిమానాలు పెరగటమే ఒకరినొకరు ఆకర్షణిక లోనై మధురానుభూతులను పొందుతారు .

సర్వారిష్టాల నుండి బయటపడుటకు ............!!

నిమ్మకాయని రెండు సమభాగములు చేసి దానిలోని గుజ్జుని తొలగించి డొప్పతో డొప్ప అమర్చి మంగళ ,శుక్రవారాల్లో గాని ,అమావాస్య రోజుల్లోగాని ,రాహుకాలంలో గాని నువ్వులనూనెతో లేదా ఆవునూనెతో దీపారాధన చేస్తే గృహదోషాలు తొలగుతాయి . సర్వారిష్టాల నుండి బయటపడతాయి . కుజ ,శుక్ర ,రాహు ,కేతు గ్రహాలు కలిగించే బాధలు వైదొలుగుతాయి . స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది . ప్రయోగ బాధలు తొలగుటకు అంకుశం వంటిది . సంకల్ప సిద్ధితో దీనిని చేస్తే కోర్కెలు తొందరగా నెరవేరతాయి.

సర్వకార్యాలయందు విజయాలు పొందుటకు ...........!!

హరిద్రా గణపతి, పసుపు కొమ్ముతో గణపతి ఆకారం చెక్కించి దాని చుట్టూ వెండి లేదా బంగారపు కవచాన్ని చేయించి మెడలో ధరించిన సాక్షాత్తు గణపతి మన చెంతను ఉన్నట్లే. విద్యాబుద్ధులు పెరుగును. సర్వకార్యాలయందు విజయాలు పొందుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు .వస్త్రాభరణముల వృద్ధి ఉంటుంది .

కోర్టు కేసులు సానుకూల పడేందుకు...........!!

శివునికి పంచదార, నీరు, పాలతో పంచాక్షరితో అభిషేకం నిర్వహించాలి . గుడిలోనే అని నియమం లేదు. ఇంట్లో చేసుకున్నా చాలు. దీని వల్ల కోర్టులో ఉన్న కేసులు సానుకూలపడతాయి.

పిల్లలు చదువులొ వెనకబడినా, విద్యపట్ల ద్యాస లెక పొయినా..........!!

పిల్లలకు చదువు చాలా అవసరం, పిల్లలు చదువులొ వెనకబడినా, విద్యపట్ల ద్యాస లెక పొయినా ఇంట్లొ లెదా విద్యార్ది గదిలొని ఈశాన్య కొణంలొ బూమికి ప్రతిక అయిన గ్లొబ్ ని ఉంచండి. దిీని వలన విద్యార్దికి చదువు బాగా వస్తుంది ఇలా చెయటం వల్ల వ్రుద్ది, విదెేశియాత్ర సంబవిస్తుంది. ప్రతి రొోజు పగటి వెళా రెండుసార్లు గ్లొబ్ ని తిప్పుతుండాలి.

అప్పుల బాధలు తొలగేందుకు ........!!

అనవసరంగా వ్యయం పెరిగి, అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తున్న, ఉదయం శివాలయం దర్శనం చేసుకుని, రావిచెట్టుకు నీరు పోస్తుండాలి.

ఇంటిలో ఏ దిక్కున బీరువా పెట్టుకోవచ్చు................!!

సాధారణంగా ఇంటిలో కుబేర మూలలో బీరువాలను పెట్టుకుంటుంటారు. మరికొందరు వారికి ఇష్టమొచ్చిన దిక్కుల్లో వీటిని ఉంచుతారు. వాస్తవంగా నైరతి లేదా వాయువ్య దిక్కుల్లో బీరువాలు పెట్టుకోవచ్చా అనే సందేహం అనేక మందిని వేధిస్తూ ఉంటుంది.
ఇదే అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. ధనం, ధాన్యం మొదలైన ఆర్థిక సంబంధమైన వాటిని నైరుతిలో పెట్టడం శాస్త్రీయత అని అంటున్నారు. అన్ని గదుల కన్నా నైరుతి గది యజమాని కనుసన్నల్లో ఉంటుందని, వాటి జమా, ఖర్చులు అన్నీ కూడా యజమాని నేతృత్వంలో జరపడానికి అనుకూలమైన గదిగా పేర్కొంటున్నారు.
ఎందుకంటే.. ఆ గదిని కుటుంబ యజమానులే వాడుతుంటారని చెపుతున్నారు. ఆ కోవలో బీరువాలలో ప్రధానమైనది దక్షిణ నైరుతిలో పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. లేదా పశ్చిమ నైరుతిలో కూడా పెట్టవచ్చని అంటున్నారు. రెండు బీరువాలు వచ్చినప్పుడు పక్కపక్కనే లేదా దక్షిణ నైరుతి ఒకటి, పశ్చిమ నైరుతి దిశలో ఒకటి పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు.

నవగ్రహాలు - నవరత్నాలు - ఫలితాలు...........!!



నవరత్నాలను ధరిస్తుంటాం. అయితే నవరత్నాల్లో నవగ్రహాలకు ఏ రత్నం విశిష్టతనిస్తుందో.. ఏ రత్నాన్ని ధరిస్తే.. ఏ దేవుని అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ఈ క్రమంలో నవరత్నాలు- నవగ్రహాల జాబితాను పరిశీలిస్తే.. సూర్య భగవానుడి అనుగ్రహం కోసం.. మాణిక్యాన్ని ధరించాలి.
అలాగే చంద్ర భగవానుడి అనుగ్రహం కోసం ముత్య రత్నాన్ని, గురు భగవానుడి అనుగ్రహం కోసం పుష్పరాగం, రాహువు కోసం గోమేధికం.. బుధగ్రహ అనుగ్రహం కోసం మరకత పచ్చ, శుక్ర భగవానుడి అనుగ్రహం కోసం వజ్ర రత్నాల్ని ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
ఇంకా కేతుగ్రహ అనుగ్రహం కోసం వైఢూర్యం, శని భగవానుడి అనుగ్రహం కోసం నీలం, కుజుని అనుగ్రహం కోసం పగడాన్ని ధరించడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. నవగ్రహాలకు సంబంధించిన నవరత్నాలను ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగి.. ఐశ్వర్యాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు.
రాశులను బట్టి, లగ్నాన్ని బట్టి, సంఖ్యలను బట్టి రత్నాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలుండవని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి లగ్నమునకు శుభగ్రహం అయిన లగ్న, పంచమ, భాగ్యాధిపతులైన గ్రహాలు అనగా.. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన రత్నాలు ధరించినచో కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు.
శుభ గ్రహాలకు రత్నములు ధరించడంతో పాటు పాప గ్రహాలకు తగిన శాంతి జరిపించు కున్నచో కచ్చితంగా జాతకంలో ఉన్న దోషాలు తొలిగి మంచి ఫలితాలు పొందుతారని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

కలలో పెండ్లి వాయిద్యాలు కనబడితే.. తాబేలు కనిపిస్తే..........

కలలో పెండ్లి వాయిద్యాలు కనబడితే ధనలాభము, వాహన లాభము కలుగును. అలాగే కలలో స్వర్గము కనిపించినచో ధనలాభము, సౌఖ్యము కలుగును. అదే కలలో యమలోకము కనపడినచో కష్టములు కలుగును.
కలలో చనిపోయిన వ్యక్తి కనపడినట్లైతే సుఖసంతోషములు, జయము, ధనలాభము కలుగును. కలలో తనకు పిచ్చి ఎత్తినట్లు కలవచ్చినచో ధననష్టము కలుగును. కలలో పిశాచములు కనబడితే దారిద్ర్యము, కార్యభంగము కలుగును.
చేపలు, కప్పలు, మొసలి మొదలగు జలచరములు కలలో కనబడటం మంచిది. తాబేలు కలలో కనిపించినట్లైతే దూరదేశమునకు పోయి అక్కడ అధికముగా ధనము సంపాదిస్తారు. ఎలుకలు కలలో కనిపిస్తే మంచిది కాదు. ధననష్టము, అపజయము కలుగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

రాత్రి అంట్లు శుభ్రం చేయకుండా అలాగే వుంచేస్తున్నారా.........

రాత్రిపూట అంట్లను శుభ్రం చేయకుండా అలాగే వుంచేస్తున్నారా, అయితే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసముండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనాలు, అల్పాహారంగానీ చేసిన తర్వాత ఆ అంట్లను అలాగే వుంచేస్తుంటారు. ఉదయాన్నే శుభ్రం చేయవచ్చునని అనుకుంటారు. అయితే ఈ అలవాటు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదని.. రాత్రి వేళకి సంబంధించిన అంట్లను వెంటనే శుభ్రపరుచుకోవడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగించే సమయంలో లక్ష్మీదేవి వస్తుందని అంటారు. అందువలన ఈ సమయంలో వీధి తలుపులు వేయకూడదని చెబుతుంటారు. తలుపులు మూసి వుంచడం వలన, అక్కడి వరకూ వచ్చిన లక్ష్మీదేవి వెంటనే వెనుదిరుగుతుందట. లక్ష్మీదేవి అలా నడచివస్తూ తన భక్తులకి సంబంధించి ఎవరి ఇల్లు పవిత్రంగా అనిపిస్తూ వుంటుందో వాళ్ల ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఈ కారణంగానే వీధి గుమ్మం దగ్గర పాదరక్షలు ఉండకూడదని అంటారు. అలాగే రాత్రి పూట ఇల్లు ఊడ్చిన చెత్త బయట పడేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడదామని అనుకుంటూ వుండగా, ఆ సమయంలో ఇల్లు ఊడ్చిన చెత్తతో ఎదురుపడకూడదనేదే ఇందులోని ఉద్దేశమని వారు చెబుతున్నారు.
Astro Numeric Venu's photo.

ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను ,జంటగా వుండే బాతు బొమ్మలను బెడ్ రూమ్‌లో పెడితే? ................

• ఫెంగ్‌షుయ్ ఏనుగు ద్వారా సంతానలేమిని పోగొట్టుకోవచ్చు
• ఆఫీసుల్లో ఏనుగు బొమ్మను పెడితే పని చురుగ్గా నడుస్తుంది.
• ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ అదృష్టాన్నిస్తుంది. 
• ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంట్లో ఉంటే పిల్లలు విద్యలో ముందుంటారు.
ఇంకా ఒకే ఒక్క ఫెంగ్ షుయ్ బొమ్మ కాదు.. జంటగా ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను బెడ్ రూమ్‌లో పెడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది.
దంపతుల మధ్య ప్రేమబంధం పటిష్టంగా ఉంటుంది. ఇంకా పడక గదిలో జంటగా వుండే బాతు బొమ్మలను ఉంచితే భార్యాభర్తలు విబేధాలు లేకుండా సుఖంగా జీవితం గడుపుతారని ఫెంగ్ షుయ్ నిపుణులు.

మహాలక్ష్మి రూపాలేమిటి - ఏం మంత్రంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది........

పాలు, పువ్వులు పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు.... అన్నీ లక్ష్మీరూపాలే. ధనం, ధ్యాన్యం అన్నీ అమ్మరూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత, వేదవిహిత ధర్మపాలన జరిగే ఇళ్ళల్లో లక్ష్మీ ఉంటుంది. అందువలన గోమాతను పూజించడం వాకిళ్ళు, గుమ్మాలకు, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి.
ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్ళల్లో లక్ష్మీఉండదు. రాత్రి ధరించిన బట్టలను తరువాతి రోజు ధరిస్తే లక్ష్మీ వెళ్లిపోతుంది. ధనం, ధాన్యం, పూజాద్రవ్యాలకు, పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మీకి కోపం వస్తుంది. ఎప్పుడూ తగాదాలుపడే వారింట్లో లక్ష్మీ ఉండదు. సోమరితనం, ప్రయత్నం లేకపోవడం లక్ష్మీకి వీడ్కోలు పలుకుతాయి. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మీ ఉండదు.
ఇకపోతే... లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది.
కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది.
గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పక మంచి ఫలితాలనిస్తుంది. మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం. అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
రాశి - పేరులో మొదటి అక్షరం - మంత్రం
మేషం - చూ,చే,చో,లా,లీ,లూ,లె,లో,అ- ఓం ఏం క్లీం సోః
వృషభం - ఇ,ఉ,ఎ,ఓ,వా,వి,వూ,వె,వో- ఓం ఏం క్లీం శ్రీః
మిథునం- కా,కీ,కూ,ఘ,చ,కె,కోహా -ఓం క్లీం ఏం సోః
కర్కాటకం- హీ,హో,హె,డా,డీ,డూ,డె,డో -ఓం ఏం క్లీం శ్రీః
సింహం- మా,మీ, మూ,మె,మో,టా,టి,టూ,టె- ఓం హ్రీం ఏం సోః
కన్య- టో,పా,పీ,పూ,ప,ణ,ఠ,పె,పో- ఓం శ్రీం ఏం సోః
తుల- రా,రీ,రూ,రె,రో,తా,తీ,తూ,తె- ఓం హ్రీం క్లీం శ్రీం:
వృశ్చికం-తో,నా,నీ,నూ,నె,నో,యా,యీ,యూ- ఓం ఏం క్లీం సోః
ధనుస్సు-యె,యో,భా,భీ,భూ,ధా,ఫా,ఢా,భె - ఓం హ్రీం క్లీం సోః
మకరం- భో,జా,జీ,ఖీ,ఖూ,ఖె,ఖో,గా,గీ- ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సోః
కుంభం-గూ,గె,గో,సా,సీ,సూ,సె,సో,దా- ఓం హ్రీం ఏం క్లీం శ్రీం
మీనం- దీ,దూ,ధ,ఝ,దె,దో,చా,చీ- ఓం హ్రీం క్లీం సోః
ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు. అందుచేత మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి. ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.

ZeeTelugu OMkaram Yogam Kshemam 5th July 2016